4 May, 2026 | 3:37 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి

09-03-2026 05:20 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణ కోసం 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి సూపరిండెంట్ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. 9 నుండి 14 సంవత్సరాల బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని దీంతో గర్భాశయ క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి మహిళా సిబ్బంది కలెక్టర్ ను మహిళా దినోత్సవ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

టి.హబ్ మేనేజర్ పై ఆగ్రహం

జిల్లా కేంద్రంలోని టి.హబ్ మేనేజర్ విదులకు గైర్హాజరు అవుతున్నాడని ఆస్పత్రి  సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయనను విదుల నుండి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డివో దత్తారావు, డిడబ్లూవో భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు.