23 March, 2026 | 4:34 PM

ప్రమాదం పొంచి ఉంటే.. ప్రయాణమెలా సాగేది?

23-03-2026 12:00 AM

అరఫీటు గుంతల రోడ్లపై అడుగేలా వేసేది?

అయిజ మార్చి 22: అయిజ మున్సిపాలిటీలోని 14వ వార్డు 2వ వార్డు మధ్యన డాక్టర్ సుబ్బయ్య ఇంటి ప్రక్కన దళితవాడకు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇది. అనునిత్యం వేల సంఖ్యలో వాహనాలు, పాదాచారులు వెళ్లే అంతర్గత రహదారి. ఈ రోడ్డులో దాదాపు అరఫీటు లోతు గుంతలు, అసలే ఇరుకుదారి వాహనాలు ఏదురేదురుగా వస్తే వెళ్లలేని పరిస్థితి అని ప్రజలు వాపోతున్నారు.

దారిమలుపు, దళితవాడకు వెళ్లే దారి డౌన్ లో ఉండడం మరియు ఇరుకైనా రోడ్డు కావడంతో ప్రమాదాలు ఎక్కువగా సంబవించే ఆస్కారమున్నదని,ప్రక్కన సుమారు మూడు ఫీట్ల లోతైన డ్రైనేజి కాలువ ఉం డడం ఆ ప్రదేశంలో రోడ్డు పగిలి భయానక పరిస్థితి నెలకొన్నది. ఆదమరచి ప్రయానిస్తే మాత్రం ప్రాణాలమీదికి తెచ్చుకున్నట్టేనని ప్రజలు మండిపడుతున్నారు.

ఈ దారిపై ప్ర వేటు పాఠశాలల బస్సులు ఉదయం (ప్రస్తుతం ఒంటి పూట బడులు కావున స్కూ ల్ బస్సులు మధ్యాహ్నం వస్తున్నాయి )సాయంత్రం, ప్రవేటు వాహనాలు ఎదురు పడి నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం లైన్ క్లియర్ కావాలంటే సుమారు అరగంట సమయం పడుతుందని అక్కడి స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతేగాక డ్రైనేజి ఓపెన్ గా ఉండడంవల్ల రోజు కంపువాసన భరించలేక పోతున్నామని దీన్ని కూడా పాలకులు, అధికారులు గమనించవసిందిగా ప్రజలు కోరుతున్నారు.

ఇదే రోడ్డు ఇక్కడ నుండి దాదాపు దళితవాడలోని చర్చి వరకు అక్కడక్కడ అరఫీటు లోతు గుంతల మయంగా మారి వాహనాల రవాణా సౌకర్యాలకు అసౌకర్యంగా మారి ఇబ్బందులకు గురిచేస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మునిసిపల్ ఎన్నికల ముందు గుంతలకు తూ తూ మంత్రంగా మట్టి వేసి అధికారులు చేతులు దులుపుకున్నారని, తరువాత ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి ఏవైనా నిధులు వస్తే పని చేయించే ఏర్పాటు చేద్దాం.

నిధులు వస్తే పని చేయించే ఏర్పాటు చేద్దాం...

ఈ ప్రదేశంలో దారిమలుపు కావడం, రోడ్డు బాగాలేక పోవడం సరియైన సూచికలు లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది.దళితవాడకు వెళ్లే ప్రధాన రహదారి కావడమా ? లేక దళితులైనందుకే విస్మరించారా అర్థం కావడం లేదు.గత పాలకులు పట్టించుకోక పోవడం కూడా విస్మయానికి గురిచేస్తుంది.కావున ప్రస్తుత పాలకులైన,అధికారులైన దీనిపై శ్రద్ద తీసుకొని రోడ్డును బాగు చేయాలని ప్రజల, బి యస్ పి పార్టీ తరపున కోరుకుంటున్నాము.

సైదులు, మున్సిపాలిటీ కమిషనర్, అయిజ 

దళితులైనందుకు ఈ సమస్యను విస్మరిస్తున్నారా ?.... 

ఇది దళితవాడకు వెళ్లే ప్రధాన రహదారి కావడంవల్ల దళితులైనం దుకు ఈ సమస్య ను విస్మరిస్తున్నారా ? అనే ఆలోచన ధోరణిలో కూడా దళితుల్లో చర్చ సాగుతుంది. గతంలో కూ డా ఇద్దరు ఎస్సి సామాజిక వర్గానికి చెం దిన వారు చైర్మన్ పదవులు చేసిన కూ డా ఈ రోడ్డును పట్టించుకోక పోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజ లు నిలదిస్తున్నారు. దళితవాడకు వెళ్లే ప్రజల్లో సుమారు ముప్పావు భాగం దళితులు ఈ దారిపైనే వెళ్లడం గమనార్హం. అనునిత్యం ఈ రోడ్డుపై ప్ర యానించవలసిన ఆవశ్యకత మరియు అవసరం ప్రజలకు ఎంతో ఉన్నది. కా వున ప్రస్తుత నాయకులైన, అధికారులైనా త్వరగా భాగు చేస్తే పాదాచారు లకు, వాహనదారులకు సమస్య ను పరిష్కరించిన వారావుతారని ప్రజలు విన్న వించుకుంటున్నారు.

 రోడ్డును బాగు చేయాలి: రాజారత్నం, బీఎస్పీ మండల ఇంచార్జి