ఇండ్ల బిల్లులు మంజూరు చేయాలి
సబ్ కలెక్టర్‌కు జర్నలిస్టుల వినతి
నారాయణఖేడ్, జూలై 7: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సబ్ కలెక్టర్ ఉమ హారతికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో పలువురు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారని, వెంటనే పూర్తయిన ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించి, పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరారు.
అలాగే కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి జర్నలిస్టుల కాలనీని అభివృద్ధి చేయాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ ఉమ హారతి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అమృత్, శ్రీకాంత్, పుండరీకం, మధుసూదన్, ఖైసర్, గోవర్ధన్, శ్రీనివాస్, రమేష్, మజర్ ఖాన్, సంగప్ప, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






