17 April, 2026 | 2:26 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

హౌస్ కీపింగ్ సూపర్వైజర్ మృతి

17-04-2026 12:00 AM

పంజాగుట్ట, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): నగరంలోని ప్రముఖ పంజాగుట్ట గెలారియా మాల్లోని పీవీఆర్ సినిమాస్‌లో విషా దం చోటుచేసుకుంది. పని ఒత్తిడి, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సత్యనారా యణ (40) అనే హౌస్కీపింగ్ సూపర్వైజర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

పురాణాపూల్‌కు చెందిన సత్యనారాయణ గెలారియా మాల్లోని పీవీఆర్ సినిమాస్‌లో హౌస్కీపింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయనకు వారాంతపు సెలవు ఉన్నప్పటికీ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో రాత్రి 10 గంటలకు విధులకు హాజరయ్యారు. రాత్రి 2 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో ఆ విషయాన్ని యా జమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

అయితే యాజమాన్యం సరిగ్గా స్పందించక పోవడంతో పరిస్థితి విషమించి తెల్లవారు జాము 3:30 గం టల ప్రాంతం లో సత్యనారాయ ణ తన భార్య కల్పనకు ఫోన్ చేసి మాల్ వద్దకు రమ్మనడంతో వెంటనే అక్కడికి చేరుకొని లోపలికి వెళ్లతుండటంతో సెక్యూరిటీ సిబ్బం ది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే అపస్మారక స్థితిలో ఉన్న సత్యనారాయణను పీవీఆర్ సిబ్బంది అమానవీయంగా గేటు బయట వదిలేశారని, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని కుటుంబ స భ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.