23-02-2026 12:23:07 AM
గ్రామంలో కొందరు కావాలని తప్పుడు సమాచారం అందిస్తున్న వైనం
అంగన్వాడీ బడిలో నుండి బియ్యం తీసుకొచ్చిన ఘనుడు
చిన్న పిల్లలకు అందించే బియ్యాన్ని ఆరోపణలకు వాడుకున్న అంగన్వాడీ కార్యకర్త భర్త
గత 4 సంవత్సరాల నుండి తుర్కపల్లి గ్రామంలో రేషన్ బియ్యం అందుకుంటున్న గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవనం గత 4 సంవత్సరాల నుండి ఆ భవనంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా లేని పోని మాటలతో కావాలని నాపై ఆరోపణలు చేస్తున్నారని తుర్కపల్లి రేషన్ షాప్ నిర్వాహకురాలు జెల్ల శ్యామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి జెల్ల శ్యామ్ అను నేను గత కొన్ని సంవత్సరాలుగా తుర్కపల్లి గ్రామంలోనే రేషన్ బియ్యన్ని పంపిణి చేస్తున్నానని అన్నారు.గ్రామస్తులకు 9 తేది వరకే పంపిణి చెయ్యడం జరిగింది.
కొందరు గ్రామస్తులు కిలోమీటర్ దూరం నుండి రేషన్ బియ్యం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తప్పుడు ఫోటోలు సృష్టించి ప్రముఖ దినపత్రికకు పంపగా గత రోజు నడుస్తేనే బియ్యం అంటూ కథనాన్ని రాశాడు. తుర్కపల్లి గ్రామస్థులు గత 4 సంవత్సరాల నుండి తుర్కపల్లిలోని అంబేద్కర్ భవనంలో రేషన్ బియ్యాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే.
బియ్యం సరఫరా చెయ్యడం జరిగిన తర్వాత 20 తేదీ న ప్రముఖ రిపోర్ట ర్ అన్ని గ్రామాల్లో రేషన్ షాప్ లేని వాటిపై కథనం రాస్తున్న అంటూ గ్రామంలో ని తెలిసిన వ్యక్తులకు ఫోన్ ద్వారా బియ్యం తిసుకుంటున్నట్టు ఒక ఫొటో కావాలని అడగగా గ్రామంలోని కొందరు కావాలని రేషన్ బియ్యం ఇచ్చిన తరువాత కొన్ని రోజులకు అంగన్వాడి అంగన్వాడీ కార్యకర్త భర్త చేసిన నిర్వాకం అంగన్వాడీ బడి లోంచి బియ్యన్ని బైటకు తీసుకోచ్చి బియ్యం సరఫరా చేసే భవనాన్ని
దాటివేసి గండిలచ్చపేట వెళ్లే రహదారిపై నిలబడి అక్కడ ఉన్న గ్రామస్థులకు తలపై పెట్టి మేము కిలోమీటర్ దూరం నుండి బియ్యాన్ని తీసుకొస్తున్నామంటూ తప్పుడు సమాచారం ఇవ్వాలని ఫొటోస్ దిగి పంపుతు వారిపై తప్పుడు సమాచారం ఇస్తున్నారు.
ఇలాంటి తప్పుడు సమాచారం కోసం చిన్న పిల్లలు ప్రభుత్వం అందించే బియ్యన్ని అంగన్వాడీ కార్యకర్త ఐన భర్త రొడ్డ దేవదాస్ ఇష్టరాజ్యం గా వ్యవహారిస్తూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతు పిల్లల బియ్యన్ని తప్పుడు ఆరోపణలకు వాడుకున్న వారిపై చట్ట పరమైన చర్యలు సంబంధిత అధికారులు తీసుకోవాలని గ్రామస్తులు తెలుపుతున్నారు.
తప్పుడు సమాచారం సరికాదు
గ్రామాల్లోనే బియ్యం సరఫరా చేస్తుండడం పట్ల కొందరు ఓర్వలేకనే తప్పుడు సమాచారం అందిస్తున్నారని అన్నారు. ఊర్లో నే రేషన్ బియ్యం తీసుకుంటున్నామని అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఎవ్వరు నమ్మొద్దని తెలిపారు.
తాడూర్ నర్సయ్య, తుర్కపల్లి, ముస్తాబాద్
నడవకుండానే బియ్యం సరఫరా
తుర్కపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా తుర్కపల్లి గ్రామంలోని అంబే డ్కర్ భవనాల్లోనే బియ్యం సరఫరా చెయ్యడం హర్షనీయమన్నారు. దూరాన్ని తగ్గించి బియ్యాన్ని అందించడం గొప్ప విషయమని తెలిపారు.
జిల్లా మల్లయ్య, తుర్కపల్లి, ముస్తాబాద్