23-02-2026 12:21:25 AM
డీసీక్ష పి.శ్రీనివాస రావు
జనగామ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జనగామ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 1779 మంది దరఖాస్తు చేసుకోగా, మొత్తంగా 1692 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని, 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 పరీక్షా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.