25 March, 2026 | 2:43 AM

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్‌లకు సన్మానం

25-03-2026 01:00 AM

పాలకవీడు(నేరేడుచర్ల ), మార్చి 24: నేరేడుచర్ల నాయి బ్రాహ్మణులు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి, వైస్ ఛైర్మన్ నూకల సందీప్ రెడ్డిలనీ మర్యాదపూరకగా కలిసి సన్మాని చారు. ఈ సందర్బంగా చైర్మన్ ,వైస్ చైర్మన్ లు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ వృత్తితో  పూర్వకాలం నుండి సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. ప్రతి మంచి కార్యక్రమంకి వారు ముందుంటారన్నారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు  దగ్గరగా ఉంటారన్నారు.

వీరికి ప్రభుత్వం, విద్య, వైద్యం ,ఆరోగ్యం, గృహ నిర్మాణం, ప్రభుత్వం ద్వారా సహకారం అందించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు కాపర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జంపాల శ్రవణ్ , మాజీ అధ్యక్షుడు మొగరాల వాసు  జంపాల వెంకన్న, రసమల్ల కృష్ణ, సమ్మెట వెంకన్న, రాంప్రసాద్,మిడిసిన మెట్ల రాజు , వీరబాబు సందీప్ తదితరులు పాల్గొన్నారు.