2 July, 2026 | 4:57 PM

Breaking News

ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •  

వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో హోమాలు... కుంకుమ పూజలు

26-11-2025 12:30 AM

పెద్ద ఎత్తున పాల్గొన్న. మహిళలు... 

సుల్తానాబాద్, నవంబర్ 25 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం అంగరంగా వైభవంగా... కన్నుల పండువగా హోమాలు... కుంకుమ పూజలు జరిగాయి... హోమాల వద్ద జరిగిన పూజల్లో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.. అనంతరం జరిగిన కుంకుమ పూజ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు... అలాగే పలు పూజా కార్యక్రమాలు జరిగాయి.

బుధవారం అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలతో కార్యక్రమం పూర్తవుతుంది...శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్టు వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరి పద్మ మహేందర్ దంపతుల ఆధ్వర్యం లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ... ఈ కార్యక్రమం లో ట్రస్ట్ గౌరవాధ్యక్షులు, గురుస్వామి మిట్టపల్లి మురళీధర్ , యంత్ర ప్రతిష్టాపకులు , ఆధర్పణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ శర్మ , ఆలయ పురోహితులు గూడ రమేష్ శర్మ , శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ మారవేణి లచ్చయ్య , ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముత్యాల రవీందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు , భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు... ఉగ్ర ప్రతిష్టాపన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని సాయిరి మహేందర్ పద్మ దంపతులు కోరారు.