ఘనంగా హోలీ సంబరాలు
పాలకవీడు, మర్చి 3 : మండల కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా సందడి వాతావరణంలో జరిగింది. ముఖ్యంగా చిన్నారులు రకరకాల రంగులు చల్లి కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాలనీలు, వీధుల్లో ఉదయం నుంచే పిల్లల అల్లరి సందడి కనిపించింది. ఒకరిపై ఒకరు రంగులు పోసుకుంటూ, నీటి తుపాకులతో ఆడిపాడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
తల్లిదండ్రుల సమక్షంలో సురక్షితంగా వేడుకలు నిర్వహించారు. ఎటువంటి అపశృతి లేకుండా హోలీ పండుగను చిన్నారులు సంతోషంగా జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ లక్ష్మి సత్యం వార్డు మెంబెర్లు జానీ, వెంకటయ్య, శ్రీను యూత్ సభ్యులు, నాగరాజు, సురేష్, నవీన్, చంటి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తిలో..
తుంగతుర్తి, మార్చి 3: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి మండలాల్లోని గ్రామాల్లో మంగళవారం అన్ని గ్రామాల ప్రజలు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని ప్రస్తాల గ్రామంలో చిన్నారులు వీరన్న బల్లికోడే వీర గంధం పూసుకుని.. కామా కామయ్య వలలో కామా గోళీలు వలలో..
అంటూ పాటలు పాడుతూ కోలలతో ఆటలాడుతూ జరుపుకున్న హోలీ పండుగ తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోలీ పండుగ సంబరాలలో ఆయా గ్రామాల నూతన సర్పంచులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మల్లెపాక సాయి బాబా, కలకోట్ల మల్లేష్, దాసరి మంజుల శ్రీను, తప్పట్ల ఎల్లయ్య, చిలకల వెంకన్న, మనోజ్, గుండ గాని మహేందర్ గౌడ్, దొంగరి శ్రీను, తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
కోదాడలో..
కోదాడ, మార్చి 3: పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో స్టూడెంట్ కరాటే క్లబ్ విద్యార్థులు మంగళవారం హోళీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కోచ్ మాధవీలత ఆధ్వర్యంలో హోళీ వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ సంతోషంగా గడిపారు.




