మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం
02-05-2026 09:15 PM
* లక్షలలో ఆస్తి నష్టం
* సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద భాదితులు తెలిపిన వివరాలు.పట్టణంలోని శ్రీనాథ్ ఆటో స్పెర్ పార్ట్స్ దుకాణంలో ప్రమాదవశత్తు మంటలు వ్యాపించాయి. దింతో దుకాణంలోని టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఆయిల్ అంటుకొని మంటలు తీవ్రంగా వ్యాపించి దుకాణం పూర్తిగా దగ్ధం అయింది. స్థానిక పైర్ సిబ్బంది వచ్చి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు.సుమారు నలభై లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణం నిర్వాహకులు తెలిపారు.విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.






