29 March, 2026 | 4:49 AM

చిన్నారుల రక్షణకు హిపమ్

29-03-2026 01:32 AM

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి పిల్లల వైద్యనిపుణుల సదస్సు

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాం తి): చిన్నపిల్లల్లో తలెత్తే అత్యవసర ఆరోగ్య సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడమే ల క్ష్యంగా నగరంలో ఐఏపీపీఈఎం 2026 (నాలుగో జాతీయ సదస్సు) ఘనంగా ప్రారం భ మైంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన 450 మందికి పైగా పిల్లల వై ద్యనిపుణులు పాల్గొంటున్నారు.

హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సద స్సుకు కిమ్స్ కడల్స్ గచ్చిబౌలి ఆసుపత్రి ఆతి థ్యం ఇస్తోంది. ప్రధానంగా చిన్నారులకు అవసరమయ్యే అత్యవసర వైద్య చికిత్సలు, ఈ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, పిల్లలకు ఎదురయ్యే మానసిక సమస్యలు.. ఇ లాంటి అంశాలన్నింటిపైనా యువ వైద్యుల కు సమగ్ర అవగాహన కల్పిస్తోంది. 

చిన్నారులకు ఎదురయ్యే కేసుల్లో 70 శాతం అత్య వసర కేసులను కేవలం ముందస్తు జాగ్రత్త లు, సరైన అవగాహనతో నివారించవచ్చని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు తెలిపారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీ గా ఉండటం, పిల్లలు స్క్రీన్ కంటెంట్ ఎక్కువగా ఆధారపడటం వల్ల కొత్త రకమైన సమ స్యలు తలెత్తుతున్నాయని కిమ్స్ కడల్స్ గచ్చిబౌలి  చీఫ్ ఆఫ్ పీడియాట్రిక్స్ డాక్టర్ నితిన్ చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు.  సదస్సులో భాగంగా యువ వైద్యుల నైపుణ్యాలను మె రుగుపర్చేందుకు 12 రకాల వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నారు.

వెంటిలేషన్, పీడియాట్రిక్ ట్రామా, నియోనేటల్ ఎమర్జెన్సీ, పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ లాంటి అంశాలపై ని పుణులు శిక్షణ ఇస్తున్నారు. ‘హీరోస్ ఆన్ వీల్స్’ పేరిట అత్యవసర స్థితిలో ఉన్న చిన్నారులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించే విధానాలపైనా శిక్షణ ఇచ్చారు. ఈ సదస్సు లో ఐఏపీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నీ లం మోహన్, చీఫ్ యునిసెఫ్ డా. జలెలం బిర్హాన్ టఫిసే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పీడియాట్రిక్ రంగంలో విశేష సేవ లందించిన డాక్టర్ సంతోష్ సోన్‌ను డా.జగన్నాథ్ సుర్పురే ఓరేషన్ అవార్డు’ అవార్డుతో సత్కరించారు. యువ వైద్యులను ప్రోత్సహించేందుకు ఉత్తమ పరిశోధనా పత్రాలు, పో స్టర్ ప్రెజెంటేషన్, కేస్ బేస్డ్ డిస్కషన్ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహు మతులు అందజేశారు. ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.