26 April, 2026 | 5:41 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

సర్పంచ్ పదవి కోసం కన్నకూతురినే కడతేర్చాడు

04-02-2026 02:09 AM

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకువచ్చి.. కాల్వలో తోసేసి

ముంబై, ఫిబ్రవరి 3: సర్పంచ్ పదవి కోసం కన్నకూతురినే ఓ కసాయితండ్రి కడతేర్చాడు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేరూర్ కు చెందిన పాండురంగకు ఒక కుమారుడు, ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డువస్తుందని భావించి, కవల పిల్లల్లో ఒకరైన ప్రాచీని మట్టుపెట్టాలనుకున్నాడు.

అందుకు ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండే సలహా తీసుకున్నాడు. పాండురంగ గత నెల 29న ప్రాచీని నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లికి తీసుకువచ్చి నిజాంసాగర్ కాలువలోకి తోసేశాడు. స్థానిక పోలీసులు బాలిక మృతదేహాన్ని బయటకు తీసి, విచారణ వేగవంతం చేశారు. పాండురంగను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.