భగ్గుమన్న రాజకీయ కక్షలు..
- కాంగ్రెస్ వార్డు సభ్యురాలీ కుల బహిష్కరణ
- బీఆర్ ఎస్ కుల రాజకీయాలు
- కన్నెపల్లిలో ఘటన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో గ్రామ రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కక్షలు కులం పేరుతో కొత్త రాజకీయ మూసుగు దొడుక్కున్నది. ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఓ వార్డు సభ్యురాలి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ ఘటన తీవ్ర కలలకం రేపుతున్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నెపల్లి మండలం భీంపూర్ గ్రామానికి చెందిన గుర్ల తానక్క ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.
అప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ కక్షలు పురివిప్పాయి. రెండు పార్టీల మధ్య రాజకీయ కక్షలు నివురుగప్పినట్టు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల బిఆర్ ఎస్ ఓటమి ని తట్టుకోలేకపోయింది.. కాంగ్రెస్ వార్డు సభ్యురాలీ బిఆర్ఎస్ లో చేరాలని తెరవెనుక నుంచి గులాబీ లీడర్లు ఒత్తిడి తెచ్చారు. అందుకు తనక్క ససేమిరా అన్నారు. అదే ఆమె నేరమైంది. గ్రామంలో బిఆర్ఎస్ కు ఉన్న రాజకీయ పట్టును రాజకీయ ఆధిపత్యానికి ఆయుధంగా సంధించారు.
గ్రామ కుల పెద్దలతో సామాజిక కుల బహిష్కరణ చేపించినట్టు తెలుస్తోంది. ఇక అప్పటినుంచి తానక్క కుటుంబాన్ని గ్రామంలో సామాజిక భహిస్కరణ కొనసాగుతున్నది. ఈ విషయమై తనక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల మాత్రం పోలీసుల కూడా తనకు న్యాయం చేయడంలేదని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు పై స్పందించి కుల బహిష్కరణ చేసి నా వారిపై చర్యలు ఇప్పటికీ లేవనీ బాధితులు వాపోతున్నారు.
- పనులకు పిలువడంలేదూ: చంద్
పార్టీ మరందుకూ పనులకు పిలువడమలేదు. కులంలో ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. ఎవరూ మాట్లాడటం లేదు. ఏమి అన్యాయం చేసినమని ఇలా కుల నుంచి వెలివేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాం. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా న్యాయం చేయాలి. కుల బహిష్కరణ చేసిన వారిపై అందుకు ప్రధాన కారకులైన బిఆర్ ఎస్ లీడర్లపై కూడా చర్యలు తీసుకోవాలి.






