26 February, 2026 | 6:20 PM

కొనుగోలు చేస్తానని బంగారు బిస్కెట్‌తో పరారీ

26-02-2026 12:00 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : బంగారు బిస్కెట్ కోనుగోలు చేస్తానని నమ్మించి అతని వద్ద ఉన్న బంగారు బిస్కెట్ తో ఓ వ్యక్తి పరారీ అయిన సంఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం, పడమటి సోమారం గ్రామానికి చెందిన వ్యాపారి ఆల్వా అజయ్‌రెడ్డి (30) ఈనెల 23న అమీర్ పేట్‌లోని ఎంజే ఎంటర్ ప్రైజెస్ లో 83 గ్రాముల బంగారు బిస్కెట్ కొనుగోలు చేసి ఇంటికి బయలు దేరాడు.

అదే సమయంలో మరో విషయంపై అతని స్నేహితుడు పరమేశ్ ఫోన్ చేసి మాట్లడగా తన వద్ద ఉన్న బంగారు బిస్కెట్ ఉందని, విక్రయించాలనుకుంటున్నట్లు అజయ్ రెడ్డి చెప్పాడు. తనకు తెలిసిన వ్యక్తి కొనుగోలు చేస్తాడని పరమేశ్ చెప్పాడు. కొద్ది సేపటికి ప్రవీణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకొని బంగారం బిస్కెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉం దని తెలిపాడు. అవుషాపూర్ వద్ద ఉన్న దీక్ష హోటల్ కు రావాలని సూచించాడు.

అక్కడికి కారులో వచ్చిన ప్రవీణ్ బంగారు బిస్కెట్ తీసుకుని తెలిసిన వారికి చూపించి కొనుగోలు చేస్తానని చెప్పి కారు లో వెళ్లిపోయాడు. ఎంతకి తిరిగి  రాకపోవటంతో బాధితుడు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకి లభించలేదు. రెండు రోజుల తర్వాత మోసపోయి నట్లు గ్రహించిన బాధితుడు ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.