2 July, 2026 | 10:53 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

హెచ్‌సీఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె

06-03-2026 02:13 AM

సికింద్రాబాద్ , మార్చి 5 : నిత్యం వివాదాలతో సతమతమయ్యే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరో ముసలం మొదలైంది. హెచ్‌సీఏ, ఉప్పల్ స్టేడియం ఎంప్లాయిస్ యూనియన్ నిరవధిక సమ్మెకు దిగింది. పెండింగ్ లో ఉన్న ఓవర్‌టైమ్ బకాయిలు, గ్రౌండ్ సిబ్బంది కన్వేయన్స్ అలవెన్సు లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీఏ సిబ్బంది సమ్మె ప్రారంభించారు.

హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని హెచ్‌సీఏ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేరే వరకూ ఉప్పల్ స్టేడియంలో పవులు నిలిపివేస్తామని హెచ్చరించింది. మూడు నెలల పాటు జీతాలు లేకుండా పనిచేసామ ని సిబ్బంది గుర్తు చేస్తున్నారు. సంస్థకు తాము వెన్నంటి నిలిచినా ప్రతిఫలంగా తమ హక్కులైనా దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి పలుసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు.

అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు సహ నం నశించి సమ్మెకు దిగినట్టు చెప్పుకొచ్చారు. సమ్మె కారణంగా ఉ ప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి హెచ్‌సీఏ మేనేజ్‌మెంట్ పూర్తి బాధ్యత వహించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడి యం ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టం చే సింది. ఇదిలా ఉంటే హెచ్‌సీఏ కోట్లాది రూ పాయలతో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం ఏంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు. బీసీసీఐ జో క్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని హెచ్‌సీఏ సిబ్బంది కోరుతున్నారు.