దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి
హైదరాబాద్: ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) పరిశీలించారు.జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బహిరంగ సభ జరగనుంది. కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
కేటీఆర్, హరీశ్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి మహిళలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్లు రావడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించండని బీజేపీ వాళ్ళు అంటున్నారని, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏమో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ చేయడానికి పోయాడని హరీష్ రావు విమర్శించారు. మెజార్టీ లేదని బీజేపీ తెలుసని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎందుకు స్పందించలేదని హరీశ్ రావు ప్రశ్నించారు.






