18 April, 2026 | 5:16 PM

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు

18-04-2026 03:52 PM

కేంద్రమంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్(Central Government) ఆమోదం లభించింది. పీఎం గ్రామ్ సడక్ యోజనకు 2028 వరకు పొడిగిస్తూ కేబినెట్ ఆమోదించింది. రూ. 83,977 కోట్లతో పీఎం గ్రామీణ సడక్ యోజన(PM Gramin Sadak Yojana)- 3కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

ఉద్యోగులకు 2 శాతం డీఏ(Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు(New Railway Projects), విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ. 9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ మధ్య రైల్వే లైన్లు విస్తరించనున్నారు. భారత్ మారిటైమ్ ఇన్సురెన్స్ పూల్(Bharat Maritime Insurance Pool) పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. రూ 12,980 కోట్లతో సముద్ర సంబంధిత ఇన్సూరెన్స్ పథకం(Insurance Scheme) తీసుకోరానుంది. వ్యవసాయ మార్కెట్లు, స్కూల్స్, ఆసుపత్రులకు వెళ్లే గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. మొత్తం రూ. 1,28,563 కోట్ల పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.