13 April, 2026 | 6:10 PM

పండిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే!

13-04-2026 04:34 PM

హైదరాబాద్: సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట(Sadashivapet) రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60 వేల క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేయాలని, పండిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేశారని హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు లేక పంట దళారుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనగలపై రైతులకు ఎకరానికి రూ. 10 వేల నష్టం జరిగిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీ పూర్తిగా బోగస్ అని ఎద్దేవా చేశారు. సన్న వడ్లకు యాసంగి బోనస్ చెల్లించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారని ఆరోపించారు.