13 April, 2026 | 5:43 PM

ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

13-04-2026 04:17 PM

ముంబై: దిగ్గజ గాయని ఆశా భోస్లే అంతిమయాత్ర ప్రారంభం(Asha Bhosle Funeral) అయింది. ఆశా భోస్లే అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోస్లే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆశా భోస్లే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. 

ఆశా భోంస్లే ఆకస్మిక మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. షారుఖ్ ఖాన్, కాజోల్, శ్రేయా ఘోషల్, కరీనా కపూర్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ, విక్కీ కౌశల్, అను మాలిక్, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చెల్లెలైన భోస్లే, ఎనిమిది దశాబ్దాల తన కెరీర్‌లో వివిధ భాషలలో 12,500కు పైగా పాటలను రికార్డ్ చేశారు. మీనా కుమారి, మధుబాల, జీనత్ అమన్ వంటి అగ్ర కథానాయికల నుండి కాజోల్, ఊర్మిళ మటోండ్కర్, అలాగే పద్మిని, వైజయంతిమాల వంటి దక్షిణాది తారల వరకు ఆమె తన గాత్రాన్ని అందించారు.