4 March, 2026 | 3:51 AM

సర్కార్ వైద్యానికి జై..

04-03-2026 12:00 AM
  1. నాడు నేను రాను బిడ్డో..

నేడు సర్కారు దవాఖానపై నమ్మకం

పెద్దపల్లి, మార్చి3(విజయ క్రాంతి) ఒక్కప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖా నకు అనే ప్రజలు,  ఇప్పుడు మేము వస్తా ము బిడ్డో సర్కార్ దవాఖానకు అని పెద్దపల్లి జిల్లా ప్రజలు వస్తున్నారు, ఇంత గొప్ప స్పందన రావడానికి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష, చింతకుంట విజయ రమణ రావు  సహాయ సహకారాలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్  నిరంతర పర్యవేక్షణ వల్ల ఈ అభివృద్ధి జరిగింది.

వివరాల్లోకి వెళితే మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రోజు రోజుకి వైద్య సేవలలో దూ సుకుపోతుంది, గడిచిన ఫిబ్రవరి నెలకు గాను మన  ఆసుపత్రి లో నమోదు అయిన సేవల వివరాలు ఇలా ఉన్నాయని, మొత్తం 22447 మంది  ఔట్ పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందారు, ఇందులో 9758 మంది జనరల్ మెడిసిన్ విభాగంలో, 660 మంది జనరల్ సర్జరీ విభాగంలో, 4263 మంది చిన్న పిల్లల విభాగంలో, 3364 మంది గైనిక్ విభాగంలో, 410 మంది ఆర్థో విభాగంలో, 1509 మంది కంటి విభాగంలో, 675 మంది ఈఎన్ టి విభాగంలో, 1039 మంది చర్మ విభాగంలో  574 మంది దంత విభాగంలో వైద్య సేవలు పొందారు.

అదే విధంగా 1872 మంది ఇన్ పేషెంట్లు గా వైద్య సేవలు పొందారు, ఇందులో 849 మంది జనరల్ మెడిసిన్ విభాగంలో, 50 మంది జనరల్ సర్జరీ విభాగంలో, 433 మంది చిన్న పిల్లల విభాగంలో,  273 గైనిక్ విభాగంలో, 90 మంది ఆర్థో విభాగంలో  174 మంది కంటి విభాగంలో ఇన్ పేషెంట్ వైద్య సేవలు పొందారువీటితో పాటు  54 ఆర్థో శస్త్ర చికిత్సలు, 81 జనరల్ సర్జరీ శస్త్ర చికిత్సలు, 164 కంటి శస్త్ర చికిత్సలు, 25 చెవి ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలు  409 డెంటల్ శస్త్ర చికిత్సలు చేశాము. గడిచిన నెలలో మొత్తం 184 డెలివరీలు చేశామని తెలిపారు.

అదేవిధంగా 27859 ల్యాబ్ టెస్టులు, 2062 అల్ట్రా సౌండ్ స్కానింగ్, 133 టిఫ్ఫా స్కానింగ్, 722 ఈ సి జి, 255 2 డి ఎకో,  1880 ఎక్స్ రే, 724 ఫిజియో థెరపీ మరియు నవజాత శిశువులకు ఇప్పటి వరకు దాదాపుగా700 మంది శిశువుల కి ట్రీట్మెంట్ చెయ్యడం జరిగిందని,308 ఆరోగ్య శ్రీ సేవలు అందించ డం జరిగిందని, వీటితో పాటు ప్రత్యేకంగా 8 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు1 యూరాలజీ శస్త్ర చికిత్స 9 రూట్ కెనాల్ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.

కావున జిల్లా ప్రజలు పెద్దపల్లి ఆసుపత్రిలో అందుతున్న అన్ని రకాల వైద్య సేవలు ఉపయోగించుకోవాలి అని ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్   తెలిపారు అదే విధంగా పై సేవలలో రోగులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చు అని తెలిపారు.హాస్పిటల్ లోఎ క్కడైనా, ఏదైనా సేవలలో ఇబ్బంది కలిగినా, లేదంటే పేషెంట్ సర్వీస్ గురించి ఏమైనా సలహాలు ,సూచనల ఇవ్వగలరని సూపరింటెండెంట్ ప్రజలను కోరుతున్నారు.