calender_icon.png 13 February, 2026 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీలో గుట్కాసురులు!

13-02-2026 12:00:00 AM

  1. నిషేధం విధించిన,గుప్పుమంటున్న గుట్కా

మండల కేంద్రంగా విస్తరిస్తున్న వ్యాపారం

కొరవడిన అధికారుల నిఘా, రెచ్చిపోతున్న మాఫియా

గుట్టలుగా గుట్కా, లక్షల్లో దందా

అధిక రేట్లతో విక్రయాలు, నిషేధం గుట్కాయ స్వాహా

మణుగూరు, ఫిబ్రవరి 12, (విజయక్రాంతి) : ఏజెన్సీలో నిషేధం ముసుగులో గుట్కా సురులు  చెలరేగిపోతున్నారు. సరిహద్దులు దాటిన గుట్కాను మాఫియా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చేరవేస్తోంది.  అడ్డొచ్చేనోళ్లను నోట్ల కట్టలతో మూయిస్తోంది. ఇదే అదనుగా కోట్లకు పడగలెత్తుతోంది. మండలంలో కొందరు గుట్కా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.

గుట్కా, పాన్ మసాలాపై ఉన్న నిషేధంపై కోర్టు స్టే విధించడం, ఇటీవల పన్నుల శాతాన్ని పెంచడం వంటి కారణాలతో అడ్డదారులు వెతుకుతున్నారు. పన్ను చెల్లించకుండానే జిల్లాలోకి సరకును  అక్రమ రవాణా సాగిస్తూ ఖజానాకు గండి కొడుతున్నారు. మరో వైపు గుట్కా మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గుప్పుమంటున్న గుట్కా విక్రయాలఫై విజయక్రాంతి కథ నం..

గుప్పుమంటున్న గుట్కా..

గుట్కా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే సదుద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా.. ఈ వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండాపోయింది. మండలానికి చెందిన పలువురు వ్యాపారులు డీలర్ల అవతారమెత్తి ప్రత్యేక వాహనాల్లో కర్ణాటక రాష్ట్రం బీదరు నుంచి దిగుమతి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా గుట్కా వ్యాపారం మూడు గుట్కాలు 6 అంబర్ ప్యాకెట్లలా విరాజిల్లుతుండడం తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. అన్ని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, టీ షాప్ లలో ఈ గుట్కాలు బహిరంగంగానే విక్ర యిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్మూలిం చకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తుందని ఆరోపణలు గుసగుసలాడుతున్నాయి. అధికారులు ఎందుకు నిలువరించలేకపోతు న్నారని ప్రజలు ప్రజలు ప్రశ్నిస్తుండడం గమనార్హం. 

పొగాకుతో నిండు జీవితాలు బలి...

మణుగూరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువగా శారీరకశ్రమను నమ్ముకుని జీవిస్తున్న వారు ఉండడంతో, వ్యవసాయ, ఇతర పనులు చేసేటువంటి వారితో పాటు యువత కూడా వీటిబారి పడుతున్నారు. వారి అలవాట్లు ఆసరా చేసుకుని, వారి ఆరోగ్యాన్ని నమిలేస్తున్నారు. గుట్కా, ఖైనీ, తంబాకు, అంబర్, పొగాకు వంటి గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. 

రూ.10కి విక్రయిం చాల్సిన ఒక్కో అంబర్ ప్యాకెట్ను రూ.20 నుంచి రూ.50 వరకు విక్రస్తున్నారు. నిషేధం పేరుతో 8చాటు మాటున అధికధరలకు విక్రయిస్తూ, అక్రమార్కులు రెండు, చేతులా సంపాదిస్తున్నారు. చీకటి వ్యాపారాన్ని విస్తరిస్తూ, అధిక లాభలను ఆర్జిస్తు, రూ. కోట్లకు పడగలెత్తుతున్నారు.

గుట్కా డ్రగ్స్ లో భాగం కాదా..?

డ్రగ్స్ పై యుద్ధం అంటూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్న పోలీస్ శాఖ గుట్కాలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్ని పాన్ షాపులు కిరాణా షాపులలో ఏ గుట్కా విక్రయాలు బాహాటంగానే కొనసాగుతున్నప్పటికీ నియంత్రించక పోవడం బాధాకరమని గుట్కాకు బానిసలైన పలువురు యువత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్కాలు సరఫరా చేస్తున్న, విక్రయిస్తున్న గుట్కా మాఫియాను నిలువరించి గుట్కా విక్రయాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు 

నిషేధిత గుట్కాప్యాకెట్లు, జర్ధా, మత్తు పదార్థాలు  అమ్మినా, నిల్వ చేసినా నేరమే.. అక్రమ అమ్మకాలను అడ్డుకో వడానికి దుకాణాల్లో తనిఖీలు చేపడు తున్నాం. ఎక్కడైనా గుట్కా విక్రయిస్తు న్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారమిస్తే విక్రయదారులపై చర్యలు తీసుకుంటాం.

-  పాటినాగబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్