13-02-2026 12:00:00 AM
కౌంటింగ్‌లో విధులు నిర్వహించనున్న 261 మంది అధికారులు సిబ్బంది
ఎస్పీ కార్యాలయం సమీపంలోని గోదాంలో కౌంటింగ్ కేంద్రాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం కౌంటింగ్ నిర్వహించేందుకు కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కామారెడ్డి లో కౌంటింగ్ కు 36 మంది సూపర్వైజర్లు, 78 మంది అసిస్టెంట్లు నియమించారు.
బాన్సువాడ మున్సిపాలిటీలో కౌంటింగ్ కోసం 21 మంది సూపర్వైజర్లు, 48 మంది అసిస్టెంట్లు, ఎల్లారెడ్డిలో 14 మంది సూపర్వైజర్లు, 28 మంది అసిస్టెంట్లు, బిచ్కుందలో 14 మంది సూపర్వైజర్లు, 28 మంది అసిస్టెంట్లను నియమించినట్లు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. పోలీస్ ల ఐదు అంచల బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్ లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని తెలిపారు.