calender_icon.png 13 February, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

13-02-2026 12:00:00 AM

అదనపు కలెక్టర్ నగేష్

పాపన్నపేట, ఫిబ్రవరి 12: మహా శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహా జాతర పనులను గురువారం సాయంత్రం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. జాతర పరిసర ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి కాలి నడకన తిరిగి పరిశీలించారు. పూర్తికాని పనులపై అధికారులను ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రంలోగా వివిధ శాఖలకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వీరి వెంట ఆలయ ఈవో వీరేశం, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.