23 June, 2026 | 11:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం

28-11-2025 12:21 AM
  1. ఇద్దరు అమెరికన్ సైనికులపై దాడి
  2. నిందితుడు ఆఫ్ఘనిస్థాన్‌కి చెందిన రెహ్మాన్‌గా గుర్తింపు
  3. ఆఫ్గన్ జాతీయుల వలస దరఖాస్తులను నిలిపివేస్తున్నట్టు ప్రకటన

వాషింగ్టన్, నవంబర్ 27: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరగగా అమెరికా ప్రభుత్వం ఆఫ్గనిస్తాన్ జాతీయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పౌరుల వలస దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తక్షణమే నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రెహ్మానుల్లా లకన్వాల్ అనే 29 ఏళ్ల ఆఫ్గన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై బుధవారం కాల్పులకు తెగబడ్డాడు.

ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, నిందితుడిపై కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) స్పందిస్తూ భద్రతాపరమైన అంశాలను సమీక్షించే వరకు ఆఫ్గన్ జాతీయుల వలస దరఖాస్తులన్నింటినీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది.

హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ నిందితుడు బైడెన్ ప్రభుత్వ హయాంలో 2021 సెప్టెంబర్ 8న ’ఆపరేషన్ అలైస్ వెల్కమ్’ కింద అమెరికాలోకి ప్రవేశించాడని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. థ్యాంక్స్ గివింగ్ పండుగకు ముందు జరిగిన ఈ దాడి ఒక రాక్షస చర్య అని పేర్కొన్నారు.

ఇది తమ దేశంపై, మానవత్వంపై జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. ఆఫ్గనిస్తాన్‌ను ’భూమిపై ఉన్న నరకం’గా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వైట్‌హౌస్ వద్ద లాక్‌డౌన్ కూడా విధించిన సంగతి తెలిసిందే.