9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఇస్కాన్ ఆలయానికి భూమిపూజ

09-03-2026 12:20 AM

హాజరైన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): నల్లగండ్ల గోపన్‌పల్లిలో ఇస్కాన్  సైబరాబాద్ ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్కాన్ వారికి నల్లగండ్లలోని గోపన్నపల్లి ప్రాం తంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం పక్కన 6 వేల గజాల భూమిని కేటాయించింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ గంగాధర్, తెలంగాణ ఎండోమెంట్స్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. నేటి కాలంలో యువతకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా నైపుణ్యాలు కూడా చాలా అవసరం అని, యువతకు సరైన దిశలో మార్గదర్శనం లభిస్తే వారు దేశ అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించగలరని అ న్నారు. భవిష్యత్తులో ఈ ఆలయం ఆధ్యాత్మి క మార్గదర్శక కేంద్రంగా, సంస్కృతి పరిరక్షణ కేంద్రంగా, అన్నదాన సేవా కేంద్రంగా, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉండాలన్నారు. అలాగే అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా 20 మంది మహిళలకు నారీ పురస్కార్ 2026 పురస్కారాలను మంత్రి కొండా సురేఖ  ప్రదానం చేశారు. ఇస్కాన్ సైబరాబాద్  ఆలయం అధ్యక్షులు శ్రీ రామ్ దాస, ఇస్కాన్ మహారాజులు, ప్రభుజీలు, ప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.