1 April, 2026 | 2:20 PM

Breaking News

లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •  

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

01-04-2026 12:00 AM

ఆయిజ మార్చి 31: అయిజ మండలంలోని ఎక్లాస్ పురం గ్రామంలో ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో ఏర్పాటు చేయనున్న సి సి రోడ్డు పనులకు మంగళవారం సర్పంచ్ కుర్వ నాగన్న గ్రామ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల స మయంలో గ్రామాభివృద్ధిపై ఇచ్చిన హామీల ప్రకారం అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయ ని, అందుకే ఏన్ ఆర్ జి ఎస్ నిధుల ద్వారా లక్ష్మన్న ఇంటినుండి కుర్వ మత్తయ్య ఇంటివరకు సి సి రోడ్డు పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు.

గ్రామంలో మౌలిక సదుపాయాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ముఖ్యంగా వీదిలైట్లు, సి సి రోడ్లు, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్లాస్పూరo గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామం దిశగా నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.