13-02-2026 12:50:26 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : భారత వైమానికదళ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే భారీ ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందం అంచనా విలువ రూ. 3.6౦ లక్షల కోట్లు. ఇది భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రా న్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ నుంచి ఆమోదం లభించింది. త్వరలో రెండు దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక చర్చలు కూడా ప్రారంభం కానున్నాయి.
అయితే, ఏడాది చివరినాటికి ఈ కొనుగోళ్లపై ఇరుదేశాల మధ్య అధికారిక ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, విడిభాగాల కూర్పు వంటి వాటికోసం ఫ్రాన్స్‌కు చెంది న రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్.. భారత్‌లోని ప్రైవేట్ రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది.
భారత్‌కు శక్తివంతమైన జెట్లు..
ఈ ఒప్పందం ద్వారా భారత వాయుసేనకు ఆధునిక సాంకేతికతతో కూడిన శక్తి మంతమైన యుద్ధవిమానాలు లభిస్తాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది మరింత కీలకం కానుంది. మరొకవైపు భారత నేవీ కోసం, ఇతర రక్షణ సామగ్రిని కూడా కొనుగోలు చేయనున్నారు.
కాగా, భారత్ ఇప్పటివరకు రెండు ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం.. ఫ్రాన్స్‌తో రూ. 59 వేల కోట్లతో ఈ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో మొదటి బ్యాచ్ భారత్‌కు చేరింది. 2022 నాటికి అన్ని విమానాలు ఐఏఎఫ్‌లో చేరాయి.
ఇక నేవీ కోసం 2025 ఏప్రిల్‌లో భారత్ రూ. 63 వేల కోట్లతో మరో ఒప్ప ందం కుదుర్చుకుంది. 22 సింగిల్ సిట్ 4 ట్విన్ సిట్, రఫేల్ మెరైన్ జెట్స్‌ను భారత్ కొనుగోలు చేసింది. వీటిని ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్‌పై మోహరిస్తారు. తాజాగా 114 రఫేల్ జెట్‌లు కూడా భారత రక్షణ దళం చేరితే ఆ జెట్‌ల సంఖ్య ౫౦కి చేరుకుంటుంది.