24 June, 2026 | 2:31 AM

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

24-06-2026 12:22 AM

ముస్తాబాద్,జూన్ 23( విజయ క్రాంతి)భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడని పేర్కొన్నారు.

యన విద్యాభ్యాసం కలకత్తాలో కొనసాగిందన్నారు. న్యాయవాద పట్టా పొందిన అనంతరం చిన్న వయసులో కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పదవి పొందిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.ఆధునిక హిందుత్వ,హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడని, హిందూ మహాసభ,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందాడని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్తు మద్దతుదారులచే మంచి గౌరవానికి పాత్రుడయ్యాడని వెల్లడించారు.

1960,70 లో భారతీయ జనసంఘ్ పార్టీ ఆ తదనంతరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి దోహదపడిందన్నారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి శ్యాంప్రసాద్ ముఖర్జీ మంచి మార్గనిర్దేశం చేశాడన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపి,జిల్లా కౌన్సిల్ మెంబర్ అంజాగౌడ్, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి ,శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.