4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఘనంగా సీతారాముల ఊరేగింపు

28-02-2026 01:26 AM

చివ్వెంల, ఫిబ్రవరి 27 : మండలంలోని కుడకుడ గ్రామంలో 14వ వార్డు న్యూ స్నేహ నగర్ కాలనీలో శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు భక్తి పారవశ్యంలో ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని అత్యంత భక్తి భావంతో కాలనీ అంతటా ఊరేగించారు. భక్తులు సీతారాముల విగ్రహాలను చేతబట్టి ప్రతి వీధి, ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లి హారతులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో కోలాటాలు ఆడుతూ భక్తి గీతాల నడుమ ఉత్సాహంగా పాల్గొనగా, యువత జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే సౌండ్ సిస్టమ్ల ద్వారా భక్తి సంగీతం మారుమోగగా, భక్తుల జైజైధ్వానాలతో కాలనీ అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. చిన్నారులు, పెద్దలు కలిసి పాల్గొనడం కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చింది. సమాజంలో ఐక్యతతో పాటు భక్తి భావాలను పెంపొందించే లక్ష్యంతో ఈ ఊరేగింపును నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.