3 April, 2026 | 7:40 PM

వాసవి మాత దేవాలయం అర్చకుల దంపతులకు ఘనంగా సన్మానం

03-04-2026 05:40 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయం అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ రజిత దంపతులను వాసవి మాత దేవాలయం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.