1 July, 2026 | 1:12 AM

సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ఘనంగా ముగింపు

01-07-2026 12:13 AM

పెబ్బేరు జూన్ 30: పట్టణ కేంద్రంలో నిర్వహించిన సీపీఎం వనపర్తి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు చివరి రోజు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అలాగే గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి పేదలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రైతాంగ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.