2 September, 2026 | 6:28 PM

మల్లాపూర్‌లో గ్రామసభ

02-09-2026 | 06:09pm

మల్లాపూర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వి.బీ.జీ రామ్‌జీ గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. సీసీ రోడ్డు పనులు చేపట్టడంతో పాటు కోతుల బెడద నివారించాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్‌రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.