మద్దతు ధరలకే ధాన్యం అమ్మండి
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 20: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకే ధాన్యం విక్రయించాలని ఏపీఎం ధర్మసాగర్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చింతమడక,సీతారాంపల్లి, మచాపూర్, పుల్లూరు గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయనతో పాటు వివిధ గ్రామాల సర్పంచుల తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు తమ పంటను బాగా ఆరబెట్టి, తేమ శాతం తగ్గించిన తర్వాతే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. దళారులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి, ప్రభుత్వ మద్దతు ధరల ప్రయోజనం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఐకెపి సిబ్బంది హమాలీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు






