2 May, 2026 | 12:08 AM

ఆర్టిసీ కార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం

01-05-2026 10:28 PM

- డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఐఎన్బీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జెండాను డీసీసీ ఆధ్యక్షులు ఆవిష్కరించారు.. ఆనంతరం డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండన్నారు. ఆర్టీసీ కార్మికులకు 11 శాతం ఫిట్మెంట్ ప్రకటించినట్లు తెలిపారు.

అదే విధంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడంపై మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమించినట్లు తెలిపారు. అర్జీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు పచ్చజెండా ఊపినట్లు తెలిపాడు. బకాయిల చెల్లింపులు, పెండింగ్లో ఉన్న పీఎస్, సీసీఎస్ బకాయిలను చెల్లించడానికి, 2021 2025 వేతన సవరణ బకాయిలను పరిష్కరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయడంతోపాటు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు.