21 July, 2026 | 5:42 PM

రైతులకు అండగా సర్కార్

21-07-2026 12:29 AM

ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి 

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి బీఆర్‌కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతు కమిషన్ బృం దంతో ఆయన దాదాపు గంటకు పైగా స మావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

దేశవ్యాప్తం గా ఎల్ నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థి తులు, చేపట్టాల్సిన నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. రైతు కమిషన్ ప్రభుత్వానికి అందిస్తున్న సూచనలు, సిఫార్సులపై డా క్టర్ చిన్నారెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషన్ పనితీరును అభినందించారు. ఈ సంద ర్భంగా ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై రైతు కమిషన్ రూపొందించిన రెండు నివేదికలను నిపుణుల కమిటీ చైర్మన్‌కు కమిషన్ బృందం అందజేసింది.

ఈ నెల 22న ప్రజాభవన్‌లో నిపుణుల కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. తన అధ్యక్షతన జరిగే ఆ సమావేశానికి హాజరుకావాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరె డ్డిని ఆయన ఆహ్వానించారు. ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నుం చి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ ఇన్చార్జ్ మెంబర్ సెక్రటరీ సంధ్యారాణి, స్పెషల్ ఆఫీసర్ కేశవులు, వ్యవసాయ రంగ నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి, కమిషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.