21 July, 2026 | 8:47 PM

కలెక్టర్ స్ఫూర్తి

21-07-2026 05:32 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని మారుమూల గిరిజన గ్రామీణ అంబుగంలో మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యటించారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఎత్తైన గుట్టపై ఏమాత్రం సౌకర్యం లేని గ్రామంలో సమస్యల పరిష్కారానికి తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలలో భాగంగా కలెక్టర్ పర్యటించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గ్రామానికి చేరుకున్న వెంటనే అప్పుడే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ సిబ్బంది గొడుగులు తీసుకురాగా అటెండర్ గొడుగు పట్టేందుకు ప్రయత్నించగా స్వయంగా తానే గొడుగు పట్టుకొని అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు ఒకరు గొడుగు పట్టగా, కలెక్టర్ మాత్రం స్వయంగా గొడుగు పట్టుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించడం అక్కడి వారందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చింది.