calender_icon.png 17 February, 2026 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన కార్పొరేషన్ల పాలకవర్గాలు

17-02-2026 01:18:26 AM

ఏడింటిలో ఐదు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ 

  1. కరీంనగర్‌లో తొలిసారి ఎగిరి బీజేపీ జెండా

కొత్తగూడెంలోకాంగ్రెస్, సీపీఐ పొత్తు

హైదరాబాద్, ఫిబ్రవరి ౧౬ (విజయక్రాం తి): రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో పాలకవర్గాలు సోమవారం కొలువుదీ రాయి. ఏడింటిలో కాంగ్రెస్ ఐదు స్థానాలు దక్కించుకోగా, బీజేపీ కరీంనగర్‌లో తొలిసారి జెండాను ఎగురవేసింది. ఇక కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో మేయర్ సీపీఐ, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ దక్కించుకున్నాయి.

రామగుండం, నల్లగొండ, నిజా మాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లుగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగూడెంలో సీపీఐ అత్యధిక స్థానాలు గెలవడంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మేయర్‌ను సీపీఐ దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్‌కు ఇచ్చారు. కరీంనగర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను బీజేపీ దక్కించుకున్నది.