22 August, 2026 | 1:49 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్

22-08-2026 01:02 PM

ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ సంచి రూ. 230కే

అర్హులైన ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు

నిజామాబాద్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddyడబుల్ బెడ్ రూం ఇళ్ల(Double-bedroom houses) లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. శనివారం నాడు మంత్రి పొంగులేటి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని వెల్లడించారు. రెండో విడతలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఏ పార్టీ వారు అని చూడకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తున్నామని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గులాబీ చొక్కా వేసుకున్న వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిందని మంత్రి ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతరం ప్రక్రియ అన్న మంత్రి పొంగులేటి అర్హులైన పేదలందరూ ఇళ్లు నిర్మించుకునే వరకు పథకం కొనసాగుతోందన్నారు.

ఇళ్ల మంజూరులో పార్టీ గురించి చూడొద్దని నిర్ణయించుకున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పార్టీ పరంగా మరో సహాయం చేయాలని భావించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సిమెంట్ బస్తా రూ. 230కే అందేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొత్త మండలాలు, ఆర్డీవో డివిజన్లు ప్రకటించి చేతులు దులుపుకుందని మంత్రి ఆరోపించారు. కొత్తగా ప్రకటించిన మండలాలు, ఆర్డీవోలకు ప్రభుత్వ కార్యాలయాలు లేవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆఫీసులకు నూతన భవనాలు నిర్మిస్తోందని చెప్పారు.  పదేళ్ల కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలనలో 60 వేల ఇళ్ల మాత్రమే ఇచ్చారని పొంగులేటి తెలిపారు. 30 వేల ఇళ్లు సగం గోడలతో కట్టి వదిలేశారని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని సూచించారు.