3 April, 2026 | 9:19 PM

రాత్రి ఇంటి ముందు బండిని ఎత్తుకెళ్లిన దొంగ

03-04-2026 07:57 PM

క్షణాల్లోనే ఆచూకీ తెలుసుకున్న పోలీసులు

బైక్ దొరకడంతో హర్షం వ్యక్తం చేసిన వాహనదారుడు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): రాత్రి ఇంటి ముందు బండిని ఫారెస్ట్ చేసి పడుకుని తెల్లారి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తి బండిని దొంగనిచ్చినట్లు ఆందోళన చెందిన వాహనదారుడు. విషయాన్ని వెంటనే ఉటావుటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేష్ కు ఫిర్యాదు చేశారు. దొంగలించిన బండిని సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ ప్రత్యేక చర్యలు దర్యాప్తు చేపట్టి దొంగను గుర్తించి బండిని పోలీస్ స్టేషన్కు తెప్పించాడు.

ఎస్సై పనితీరుపై వాహనదారుడు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశాడు. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన రామయ్య గారి నరేష్ గౌడ్ 02-04-2026 తేదీన, ఉదయం తనకు రోజూ మాదిరిగానే బాన్సువాడలోని బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగానికి తన పల్సర్ బైక్‌పై వెళ్లి, అదే రోజు రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో ఇంటికి వచ్చి తన ఇంటి కాంపౌండ్‌లో బైక్‌ను పార్క్ చేసి నిద్రపోయాడు.

మరుసటి రోజు ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా బైక్ దొరకకపోవడంతో బాధితుడు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.వాహనదారుడు పిర్యాదు మేరకు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, నిందితుడు ఎం.డి. శౌకత్ అలీ, కామారెడ్డి నివాసి ను గుర్తించి ఈ శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు,ఎల్లారెడ్డి ఎస్సై మహేష్  తెలిపారు.