17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో గొల్ల కురుమలు పోటీకి సై

04-10-2025 07:24 PM

రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి గౌరవించాలి..

తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి కోరే రవి యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందర్ రాజ్ యాదవ్ విన్నపం

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో బోళ్ళ రాజాలు యాదవ్ అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్థం చందర్ రాజ్ యాదవ్ కోరే రవి యాదవ్ లు మాట్లాడుతూ గోవిందరావుపేటతో పాటు ములుగు జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన గొల్ల కురుమలు స్తానికి సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపడం రాజకీయ పార్టీలు తమ కులానికి ప్రాధాన్యతనిస్తూ టికెట్ల కేటాయింపు చేసినట్లయితే పోటీచేసి గెలుపును సాధించి మీ పార్టీకి పేరుతెచ్చి పెట్టడమే కాకుండా మీ పార్టీకి అండగా ఉంటారని రవి యాదవ్ తెలిపారు. కావున రాజకీయ పార్టీలపెద్దలు గొల్ల కురుమలకు జిల్లా మొత్తంలో టికెట్ల కేటాయించి గౌరవించాలని విన్నపం చేస్తున్నాం లేని పక్షంలో ఇండిపెండెంట్ గా కూడా పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రవి యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జి ఎలెందర్ యాదవ్ జల్లెళ్ళ కొమురయ్య యాదవ్ .మేడుదుల వెంకన్న యాదవ్ ఎల్లావుల రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.