13 March, 2026 | 4:09 AM

ఆస్తి పన్ను బకాయిదారులకు గోల్డెన్ ఛాన్స్

13-03-2026 12:00 AM
  1. వడ్డీలో 90 శాతం మాఫీ..
  2. ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏళ్ల తరబడి పన్ను చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయిన వారికి ఊరటనిస్తూ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

ఈ పథకం కింద 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీ లో ఏకంగా 90 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ అర్‌వీ కర్ణన్ వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, భారీ వడ్డీ భారం నుంచి విముక్తి పొందాలని అధి కారులు సూచిస్తున్నారు.సాధారణంగా ఆస్తి పన్నును సకాలంలో చెల్లించని పక్షంలో ఏటా భారీగా వడ్డీ పేరుకుపోతుంది.

చాలా మంది యజ మానులు అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండటంతో పన్ను కట్టడానికి వెనుకాడతారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఓటీఎస్ పథకా న్ని ప్రవేశపెట్టింది.  ఈ నెల మార్చి 31వ తేదీలోపు తమ పాత బకాయిలను ఒకేసారి చెల్లించే వారికి మాత్ర మే వడ్డీపై 90 శాతం రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మళ్లీ పాత వడ్డీ నిబంధనలే వర్తిస్తాయని కమిషనర్ అర్‌వీ కర్ణన్ తెలిపారు.