15 April, 2026 | 2:36 AM

ఇన్‌స్టామార్ట్ లో గోల్డ్ ప్రైస్ లాక్ ఫీచర్‌

14-04-2026 10:11 PM

హైదరాబాద్ ఃనగరంలోని హుస్సేన్ సాగర్  సరస్సు వద్ద ప్రజలు దేనికోసమో వెదుకుతూ తీవ్రంగా తవ్వుతున్న దృశ్యాలు కనిపించి ఉంటే, మీరు ఒక్కరే కాదు. ఎందుకంటే,  హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద పారలతో కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణేల కోసం వేటాడుతున్న జనసమూహాల వీడియోలు వైరల్ అయ్యి, ఇంటర్నెట్‌ లో విపరీతమైన చర్చకు దారితీసాయి. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్, మామ్స్  సహకారంతో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి కార్యక్రమం, నగరంలో అత్యధికంగా ఫోటోలు తీయబడిన సరస్సు తీరంలోని ఒక భాగాన్ని, చాలా మంది ఆన్‌లైన్ వినియోగదారులు "మినీ గోల్డ్ రష్" అని పిలిచే విధంగా మార్చేసింది.

మట్టితో నింపిన గుంటలో దాచిన నాణేల కోసం నగరవాసులు తవ్వుతున్న క్లిప్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో బాగా వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమం, ఇన్‌స్టామార్ట్‌లో ప్రారంభించబడిన 'గోల్డ్ ప్రైస్ లాక్' ఫీచర్‌తో పాటుగా  జరిగింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 16 మధ్య ఉన్న బంగారం ధరను ఖరారు చేసుకుని, ఆ తర్వాత బంగారం కొనడానికి పవిత్రమైన సందర్భంగా భావించే అక్షయ తృతీయ సమయంలో తమ కొనుగోలును పూర్తి చేసుకోవచ్చు. కాగా గోల్డ్ ప్రైస్ లాక్ సదుపాయం ఇన్‌స్టామార్ట్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 16 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ క్యాంపెయిన్ లో  భాగంగా, కార్యక్రమ ప్రదేశంలో దాచిన బంగారు నాణేలతో నిండిన ఒక పెద్ద గుంతను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఆ గుంతను తవ్వి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోమని ప్రోత్సహించారు. ఈ ఇంటరాక్టివ్ కార్యక్రమానికి ప్రజల నుంచి  భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగించే అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. సాధారణంగా అక్షయ తృతీయ సమయంలో దీనికి డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం, ప్రతి ఏటా ఈ పండుగ వేళ, అధిక శాతం కొనుగోళ్లు జరుగుతుంటాయి.; కేవలం ఈ పండుగ సమయంలోనే దాదాపు 25 నుండి 30 టన్నుల బంగారం కొనుగోలు చేస్తారని అంచనా.