16 June, 2026 | 11:34 PM

పెరిగిన బంగారం, వెండి ధరలు

16-06-2026 12:45 AM

తులంపై రూ.2,242 పెరుగుదల

హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,490

కిలో వెండి ధర రూ.2.57లక్షలు

సారాంశం: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,490కు చేరగా, వెండి కిలో ధర రూ.2.57 లక్షలకు చేరుకుంది.

ఇలాంటి తాజా బంగారం, వెండి ధరల అప్‌డేట్స్ కోసం Vijayakranthi News‌ ను ఫాలో అవ్వండి.

న్యూఢిల్లీ, జూన్ 15: అమెరికా మధ్య శాంతి ఒప్పందం ప్రకటనతో ఒకపక్క మార్కెట్ సెంటిమెంట్ బలపడటం, మరోపక్క అంతర్జాతీయంగా సానుకూల సంకేతా లు కనిపించడంతో సోమవారం బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,55,490 పలికింది. అటు వెండి కేజీ ధర 2.57లక్షలకు చేరింది. గత వారం ఒక దశలో పసిడి ధర రూ.1.5లక్షల కన్నా కిందికి పడిపోయిన విషయం తెలిసిందే.

మార్కెట్లు, పెట్టుబడులు, ఆర్థిక రంగానికి సంబంధించిన మరిన్ని వార్తల కోసం Business News విభాగాన్ని సందర్శించండి.

ఒక్కరోజులోనే రూ.2,242 పెరిగిన బంగారం ధర.. ఇకపై ఇంకా పెరుగుతుందా? పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే.

10 గ్రాముల పసిడి ధర రూ.2,242 పెరిగి రూ.1.52 లక్షలకు(అధనపు చార్జీలు కాకుండా) చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో, ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం ధర 2,242 పెరిగి, 10 గ్రాము లకు రూ.1,52,770 వద్ద నమోదైంది. అంతర్జాతీయ విపణిలోనూ పసిడి, వెండికి గిరాకీ పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4,323 డాలర్లు, ఔన్సు వెండి ధర 70.38 డాలర్లకు చేరింది. గతవారం బంగారం ధర ఒక దశ లో సుమారు 4000 డాలర్లకు తగ్గింది. ఇ దిలా ఉంటే కమొడిటీ ఎక్సేంజీలో గోల్డ్ ఫూచర్స్ ధర రూ.1,53,258గా ఉంది. వెండి ఫ్యూచర్స్ ధర రూ.2,52, 383గా ట్రేడ్ అవుతోంది. 

దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ఆర్థిక, రాజకీయ వార్తలను National News‌లో తెలుసుకోండి.

FAQ's

1. నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంత?
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,490గా నమోదైంది.

2. బంగారం ధర ఒక్కరోజులో ఎంత పెరిగింది?
10 గ్రాముల బంగారం ధర రూ.2,242 పెరిగింది.

3. వెండి ధర ఎంత ఉంది?
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.57 లక్షలకు చేరుకుంది.

4. బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ బలపడటం ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.

5. బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశముందా?
అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.