ఎస్ఆర్ నగర్‌లో వ్యభిచార పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్
సనత్‌నగర్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ వ్యభిచార కార్యకలాపాలపై పోలీసులు దాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఇద్దరు మహిళలను రక్షించారు. 29.03.2026 తేదీన సుమారు సాయంత్రం 4:30 గంటల సమయంలో బి.కె. గూడ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఎస్ఆర్ నగర్ పోలీసులకు అందింది. దీనిపై ఎస్.ఆర్. నగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతితో పంచుల సమక్షంలో సాయంత్రం 5:50 గంటలకు ప్రత్యేక దాడి చేపట్టారు.
దాడిలో ప్రధాన నిందితుడు బైరెడ్డి రమేష్ రెడ్డి (45), సబ్ ఆర్గనైజర్ తుత్తూరు వంశీ (24), కస్టమర్ గంకిడి లక్ష్మణ్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. వీరు మధ్యవర్తుల సహాయంతో మహిళలను సమకూర్చి డబ్బుల కోసం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన మరియం (25), అంజనా దాస్ (18) అనే ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు.
ఈ వ్యవహారంలో చైతన్య అనే సప్లయర్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.దాడి సమయంలో మూడు మొబైల్ ఫోన్లు, రూ.2,150 నగదు, ఉపయోగించిన కండోమ్స్, ఒక కండోమ్ ప్యాకెట్, అలాగే ఒక యాక్టివా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.రక్షించబడిన మహిళలను భద్రతతో తరలించి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్.ఆర్. నగర్ పోలీసులు తెలిపారు.




