నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభించిన సర్పంచ్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని చినుర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం మండల అధికారులతో కలిసి గ్రామ సర్పంచ్ మురళి గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మురళి గౌడ్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు. గ్రామ సర్పంచ్ మురళి గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని ఎప్పుడు పేదల కోసం పాటుపడుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ప్రజలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం నిర్మించడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదల కలలు సాకారం అవుతున్నాయని అన్నారు. ఒక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మరువలేనిమన్నారు.గతంలో ఇంద్ర గాంధీ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం తెలంగాణ ప్రజలు మరువలేనిది అన్నారు.
ప్రతి పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నూతన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు చిత్రపటాలను దేవుళ్ళ ఫోటోలకు సమానంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురళి గౌడ్, ఎంపిఓ ప్రభాకర్ చారి, కార్యదర్శి సరెంధర్, గ్రామ పెద్దలు గంపల వెంకయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




