30 March, 2026 | 10:25 PM

ఘనంగా రాములోరి వసంతోత్సవం

30-03-2026 08:50 PM

కోలాట నృత్యాలతో గ్రామ పురవీధుల్లో సీతారాముల ఊరేగింపు

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆళ్లపల్లి గ్రామంలో కొలువుతిరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది భద్రాచలంలో మాదిరిగా ఐదు రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కళ్యాణానికి ముందు రోజు ఎదుర్కొల్లు రెండవ రోజు స్వామివారి కళ్యాణం మూడవరోజు దొంగల దోపిడీ నాలుగవ రోజు నాగవెల్లి 5వ రోజు వసంతోత్సవ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఈ సందర్భంగా సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల విగ్రహాలను గ్రామ పురవీధుల్లో కోలాటం బృందాలతో డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగిస్తూ రంగులు పూసుకుంటూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు గౌరిశెట్టి శ్రీనివాసరావు అబ్బు నాగేశ్వరరావు నరేడ్ల వెంకన్న సిరి నోముల వద్రేశ్వరరావు బూరుగడ్డ రాములు అనుమోల వెంకటేశ్వరరావు సంకా ప్రభాకర్ తెలగాని శ్రీనివాస్ నరేడ్ల శ్రీనివాస్ నువ్వుల నరసింహారావు సిరి నోముల శ్రీనివాస్ రావు మంత్రి కృష్ణార్జున్ పానుగంటి నరసింహారావు దొంగరి శోభన్ వినోద్ పండు కుమారస్వామి పవన్ నరేడ్ల సాయి నరేడ్ల సతీష్ యోగి తెలగాని పురుషోత్తం కోలాట బృందం. మహిళలు  తదితరులు పాల్గొన్నారు