7 August, 2026 | 10:16 AM

20 నెలల్లో 150 జీసీసీలు

07-08-2026 12:00 AM
  1.     1.5 లక్షల మందికి ఉపాధి 
  2. హైదరాబాద్‌పై ప్రపంచ సంస్థల నమ్మకానికి నిదర్శనమిది
  3. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
  4. జేఎల్‌ఎల్ జీసీసీ ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : తెలంగాణలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) జోరు కొనసాగుతోందని, గడిచిన 20 నెలల్లో కొత్తగా 150 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించా రు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను గుర్తించి సిఫారసు చేసే సంస్థగా జేఎల్‌ఎల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాంటి సంస్థ సైతం హైదరాబాద్‌ను తన జీసీసీ కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఐటీ కార్యకలాపాలు మార్పులకు లోనవుతున్న తరుణంలో, ఇన్నోవేషన్ ఆధారిత జీసీసీలు భవిష్యత్ ఉపాధికి ప్రధాన కేంద్రాలుగా అవతరిస్తున్నాయని మంత్రి చెప్పారు. కత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ ప్రభావంతో సాం కేతిక రంగంలో మార్పులు వచ్చినా, జీసీసీల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో జేఎల్‌ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జీసీసీల వేగవంతమైన విస్తరణకు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమై న ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణాలన్నా రు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు ఎంత కీలక పాత్ర పోషించిందో, ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్, ఏఐ సిటీ, భార త్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు భవిష్యత్ పెట్టుబడులకు బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అ నుగుణంగా ఏఐ, డీప్‌టెక్, అధునాతన సాం కేతిక రంగాలకు అవసరమైన మానవ వనరులను రాష్ర్టం సిద్ధం చేస్తుందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు

ఐటీ కేంద్రంగా మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక రంగాల్లోనూ ప్రపం చ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా హైదరాబాద్ ఎదుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 2024-26 మధ్య దేశవ్యాప్తంగా జీసీసీల కార్యాలయ లీజింగ్‌లో హైదరాబా ద్ వాటా 16 శాతం నమోదైందని పేర్కొన్నారు. నగరంలో మొత్తం కార్యాలయ లీజింగ్‌లో జీసీసీల వాటా 42 శాతానికి చేరుకుం దని, ఇది హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో జీసీసీలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబిం బిస్తోందన్నారు.

ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలకు చెందిన జీసీసీల ఏర్పాటులోనూ హైదరాబాద్ తొలి ఎంపికగా నిలుస్తుందన్నారు. జేఎల్‌ఎల్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే వచ్చే రెండేళ్లలో సుమారు 1,600 మందికి ఉపాధి లభించనుంది. కార్యక్రమంలో జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ రాధా ధిర్, హైద రాబాద్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్, గ్లోబల్ సర్వీస్ సెంటర్ హెడ్ ధీరజ్ పోప్లీ, ఐటీ శాఖ సలహాదారు సాయి కృష్ణ పాల్గొన్నారు.