18 July, 2026 | 12:25 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

గాజుబొమ్మ

06-04-2026 01:59 AM

దోసెడు నీళ్లు పోసి

పిలిస్తే పలికే అందరి బంధువు

మనసారా ఆహ్వానిస్తే

పరవశించి పోయే ఆకుపచ్చని సాయం

మనసుండాలే గానీ

ప్రకృతి రాఖీ కట్టని తోబుట్టువు


ప్రేమిస్తే

విరగబూసే పూలచెట్టు

లాలిస్తే చంక దిగని చంటిపాప

తల్లికి సేవ చేసుకున్నట్టు

యువరాణిలా చూసుకోవడం

మన ధర్మం


వనాలు నాటితే

నీడ దొరుకుతుంది

అడవుల్ని కాపాడితే వర్షం లభిస్తుంది

వానంటే ఆశ ఎండిపోయిన 

గొంతులో కురిసే

అమృతధార

వాన.. మానవలోకం కలలు కనే మెతుకు 

పంట ప్రకృతి పచ్చగా ఉంటే

చుట్టూ ప్రాణవాయువు కంచె కడుతుంది

కాలుష్యపు కోరలు తాకి ఓజోన్ గాయపడ్డది

నిప్పులుకక్కుతూ సూర్యుడు

తాండవమాడకముందే

పుడమి మీద పచ్చందం పోగు చేసుకుని

రక్షా కవచం కుట్టేసుకుందాం

ఛిద్రమయి పోతున్న భవిష్యత్తు మీద

దృష్టి జారి పోనివ్వని ఒప్పందమవుదాం !

మానవ ప్రపంచం

గుండెపై చెయ్యి వేసుకొని

హాయిగా నిద్దుర పోయే ఊపిరి పాటవుదాం

గాజుబొమ్మ బాగున్నప్పుడే

భద్రంగా చూసుకుందాం!

 గజ్జెల రామకృష్ణ