12 March, 2026 | 9:49 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అన్ని దానాలకన్న అన్నదానం మిన్న

12-03-2026 05:58 PM

మాజీ జెడ్పిటిసి అయిల రమేష్

సుల్తానాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి): అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండల మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపీపీ అయిల రమేష్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కందుకూరి పద్మ- ప్రకాశ్ రావు (పెద్దన్న ) దంపతుల  కుమారుడు కందుకూరిసాయినిఖిల్-అఖిల (యు ఎస్ ఏ) 3వ వివాహ వార్షికోత్సవము ను పురస్కరించుకొని  స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలోని వికలాంగులకు అన్నదానం , పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జానీ మియా అనే వికలాంగుడికి వాకర్ ను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అయిల రమేష్ మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడంఅభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, అమిరిశెట్టి తిరుపతి, కుమార్ కిషోర్, యేల్ల రాజు, నోముల శ్రీనివాస్ రెడ్డి, పేగడ పరుశురాములు, పూసాల రామకృష్ణ, ఏర్రోజు వేణు, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.