6 May, 2026 | 2:11 AM

ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి!

06-05-2026 12:52 AM

‘సైయారా’తో యావత్తు సినీప్రియుల దృష్టిని ఆకర్షించిన సరికొత్త అందం అనీత్ పడ్డా. ఈ చిత్రంతో బాలీవుడ్‌తోపాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుందీ యువ కథానాయకి. ఈ సినిమాలో తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తోది. ఇటీవల ఓ హారర్ కామెడీ చిత్రాన్ని ఓకే చేసిన ఈ ముద్దుగుమ్మ మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూ పొందుతున్న ‘శక్తి శాలిని’ చిత్రంలో భాగమైంది.

బెంగాలీ జానపద కథల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శక్తి, శాలిని అనే విభిన్నమైన రెండు వేర్వేరు పాత్రల్లో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలావుంటే, అనీత్  తాజాగా మరో కొత్త ప్రాజెక్టు అప్డేట్‌ను తనదైన శైలిలో ఇచ్చింది. ‘ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి!’ అంటూ ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేసింది. వైఆర్‌ఎఫ్ బ్యానర్‌లో అనీత్ పడ్డా న టిస్తున్న రొమాంటిక్ చిత్రం ‘సత్రంగా’కు సంబంధించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అహాన్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు.